తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా సంక్షోభానికి డెంగీ తోడైతే.. ఇక అంతే!

దేశంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. ఇదే సమయంలో వర్షాకాలం నేపథ్యంలో ఇతర అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఏటా లక్షల కేసులు నమోదయ్యే డెంగీ వ్యాధిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఏకకాలంలో ఎదుర్కొనే సామర్థ్యంలో దేశానికి లేదని తేల్చిచెబుతున్నారు. రెండు వ్యాధుల లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయని.. డెంగీ ప్రబలితే కరోనా సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరిస్తున్నారు.

Season of two viruses? Scientists worried that dengue outbreak may aggravate COVID-19 crisis
కరోనా సంక్షోభానికి డెంగీ తోడైతే.. ఇక అంతే!

By

Published : Jul 11, 2020, 12:09 PM IST

కరోనా వైరస్​ పట్టిపీడిస్తున్న భారత దేశంలో నెమ్మదిగా సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగీ వ్యాధి తీవ్రతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉండటం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే ఈ రోగాలను ఏకకాలంలో ఎదుర్కొనే సామర్థ్యం, మౌలిక వసతులు దేశ ఆరోగ్య రంగానికి లేవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 'డెంగీ-కరోనా' ప్రభావం వ్యాధుల పరీక్షల నిర్వహణపై పడుతుందని.. వీటి బారినపడే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2016-2019 డేటాను పరిశీలించిన వైరాలజిస్ట్​ షాహిద్​ జమీల్​.. దేశవ్యాప్తంగా ఏటా 1,00,000-2,00,00 డెంగీ కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఒక్క 2019లోనే 1,36,422 కేసులు వెలుగుచూశాయని నేషనల్​ వెక్టర్​ బోర్న్​ డిసీస్​​ కంట్రోల్​ ప్రోగ్రామ్​ గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా వైరస్​-డెంగీల్లో ఒకే విధంగా.. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పుల లక్షణాలుంటాయి. తేలికపాటి జ్వరం వస్తేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో.. రెండు అంటువ్యాధుల ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

డెంగీ వ్యాధి.. కరోనా సంక్షోభాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశముందని కోల్​కతాలోని అమిటీ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​ ధ్రువ్​​జ్యోతి ఛటోపాధ్యాయ్​ హెచ్చరించారు.

"దీనిని ఇంకా సరిగ్గా అధ్యయనం చేయలేదు. కానీ దక్షిణ అమెరికా ఇదే తరహా పరిస్థితులు ఎదుర్కొంది. ఈ పరిస్థితులు అక్కడి ఆరోగ్య వ్యవస్థకు అనేక సవాళ్లు విసిరాయి. డెంగీ-కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది."

--- ధ్రువ్​​జ్యోతి ఛటోపాధ్యాయ్​, అమిటీ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​.

ఈ నేపథ్యంలో.. సన్నద్ధతపై పలు ప్రశ్నలు సంధించారు వైరాలజిస్ట్​ ఉపాసన రాయ్​.

"డెంగీ ప్రబలినప్పుడు.. ఏటా ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి. ఆ పరిస్థితులను అదుపుచేయలేకపోతాం. మరి ఇప్పుడు కరోనా-డెంగీని ఒకేసారి ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆలోచించామా? వాటి లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. మరి అది కరోనా వైరసా? లేక డెంగీనా? అని నిర్ధరించే సామర్థ్యం మనకు ఉందా?"

-- ఉపాసన రాయ్​, వైరాలజిస్ట్​.

ఇదీ చూడండి:-క్షణాల్లో వైరస్​ పనిపట్టే శానిటైజర్​ అభివృద్ధి చేసిన నిట్​!

ABOUT THE AUTHOR

...view details