తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారస్వామి రాజీనామా తప్పదు: యడ్డీ - భాజపా

కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం కోర్టు తీర్పును ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప స్వాగతించారు. సభలో బలం లేనందున రేపు కుమారస్వామి రాజీనామా చేయక తప్పదన్నారు.

కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప

By

Published : Jul 17, 2019, 12:50 PM IST

కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం తీర్పును అసంతృప్తుల నైతిక విజయంగా అభివర్ణించారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప. సభలో బలం లేనందున.. రేపు కుమారస్వామి రాజీనామా చేయక తప్పదని జోస్యం చెప్పారు.

"సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయం. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నైతిక విజయం. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. స్పీకర్​ అధికారాలపై కోర్టు తరువాత నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం జరుగుతుంది."

- యడ్యూరప్ప, కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షులు

ప్రభుత్వం పడిపోతుంది

రేపు జరిగే విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందని నమ్ముతున్నానన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషీ.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషీ

"సుప్రీం తీర్పు ప్రకారం సభకు హాజరై ఓటు వేయాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయకూడదు. విప్​ జారీ చేయకూడదు. రేపు విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని నేను నమ్ముతున్నా. ప్రభుత్వం అధికారం కోల్పోతుంది. అంతా రేపే తేలుతుంది."

-ప్రహ్లాద్​ జోషీ, కేంద్ర మంత్రి.

ఇదీ చూడండి: 'బలపరీక్ష హాజరుపై తుది నిర్ణయం ఎమ్మెల్యేలదే'

ABOUT THE AUTHOR

...view details