తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం పిటిషన్​పై సెప్టెంబర్​ 5న నిర్ణయం

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు సెప్టెంబర్​ 5న ఆదేశాలు ఇవ్వనుంది. అప్పటివరకు అరెస్టు చేయకూడదని ఈడీకి స్పష్టం చేసింది సుప్రీం. ఈడీ కేసులో ముందస్తు బెయిల్​ ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు చిదంబరం.

చిదంబరం పిటిషన్​పై సెప్టెంబర్​ 5న నిర్ణయం

By

Published : Aug 29, 2019, 6:21 PM IST

Updated : Sep 28, 2019, 6:36 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా సంస్థకు సంబంధించిన ఈడీ కేసులో ముందస్తు బెయిల్​ ఇవ్వాలంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్​పై సెప్టెంబర్​ 5వ ఆదేశాలు జారీ చేయనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. చిదంబరానికి గురువారం వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది జస్టిస్​ భానుమతి, జస్టిస్​ ఏఎస్​ బోపన్నల ధర్మాసనం.

నివేదికలు, విచారణ పత్రాలను సీల్డ్​ కవర్​లో సమర్పించాలనిఈడీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం సోమవారం వరకు కస్టడీలోనే ఉండనున్నారు. రిమాండ్​ పొడిగింపు సీబీఐ కోర్టు మాత్రమే చేయగలదని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా చెప్పడం వల్ల ఈ అంశంపై స్పందించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఇదీ చూడండి:-కశ్మీర్​ విభజన, అభివృద్ధిపై కేంద్రం ముమ్మర కసరత్తు

Last Updated : Sep 28, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details