తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపే అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం తీర్పు

అయోధ్య తీర్పు

By

Published : Nov 8, 2019, 9:11 PM IST

Updated : Nov 8, 2019, 9:41 PM IST

21:33 November 08

రేపే తీర్పు- సర్వత్రా ఉత్కంఠ

దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పును రేపు వెలువరించనుంది సుప్రీంకోర్టు . 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం అక్టోబర్​ 16న తీర్పును రిజర్వ్​ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వివాదాస్పద అయోధ్య కేసుపై తీర్పును వెలువరించే అవకాశముంది.

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు హోంమంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.
 

21:15 November 08

ఉదయం 10 గంటల 30 నిమిషాలకు!

జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వివాదాస్పద అయోధ్య కేసుపై తీర్పును వెలువరించే అవకాశముంది.

40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం అక్టోబర్​ 16న తీర్పును రిజర్వ్​ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. సహజంగా శనివారం కోర్టుకు సెలవు దినం. అయినప్పటికీ రేపే అయోధ్య కేసు తీర్పునివ్వాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.

21:05 November 08

రేపే అయోధ్య తీర్పు

రేపు అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది. అత్యంత సున్నితమైన అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసు తీర్పు కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Nov 8, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details