తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు ఆందోళనలపై నేడు సుప్రీం విచారణ - సుప్రీం కోర్టు విచారణ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. కేంద్రంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించని క్రమంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : Jan 11, 2021, 5:01 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లతో పాటు, దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. రైతులతో కేంద్రం 8 దఫాల చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని తరుణంలో సుప్రీం కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

సాగు చట్టాలపై వ్యాజ్యాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

ఈనెల 6న జరిగిన విచారణలో రైతుల ఆందోళన విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి తమకు కనిపించటం లేదని వ్యాఖ్యానించారు సీజేఐ జస్టిస్​ బోబ్డే. ఈ నేపథ్యంలో రైతులు-కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయని అటార్నీ జనరల్​ కే.కే. వేణుగొపాల్​ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో.. సాగు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను అందిస్తే.. రైతులు-ప్రభుత్వం మధ్య సంప్రదింపులు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జనవరి 11కు వాయిదా వేసింది ధర్మాసనం.

నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న కేసుల్లో తమను క్షక్షిదారుగా చేర్చాలంటూ భారతీయ రైతు సంఘాల కన్సార్టియం (సీఐఎఫ్​ఏ) గత శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ సంస్కరణలు రైతులకు ప్రయోజనకరమని పేర్కొంది. ఈ విషయంపై అభిప్రాయం తెలిపేందుకు ఇతర రైతు సంఘాలకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది.

ఇదీ చూడండి:బాలికపై గ్యాంగ్​ రేప్- ఆరుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details