తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీవీప్యాట్​ రసీదుల లెక్కపై వచ్చేవారం విచారణ

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్​పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు దాఖలు చేసిన ఈ పిటిషన్​పై వచ్చే వారం వాదనలు విననుంది న్యాయస్థానం.

వీవీప్యాట్​పై ప్రతిపక్షాల పిటిషన్​ను స్వీకరించిన సుప్రీం

By

Published : May 3, 2019, 11:22 AM IST

Updated : May 3, 2019, 11:35 AM IST

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​పై సుప్రీంకోర్టు వచ్చేవారం విచారణ చేయనుంది. తప్పనిసరిగా 50 శాతం వీవీప్యాట్​ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని ఇటీవల వ్యాజ్యం​ దాఖలు చేశాయి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలు. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు న్యాయవాది, కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ.

అంతకుముందు ప్రతిపక్షాల పిటిషన్​పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 5 వీవీప్యాట్​ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు వెలువరించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్​దారులు మరోసారి కోర్టులో రివ్యూ పిటిషన్​ దాఖలు చేశారు.

Last Updated : May 3, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details