'రాష్ట్రీయ జనతాదళ్' (ఆర్జేడీ) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించింది.
దాణా కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్కు జైలు శిక్ష పడింది. లాలూ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 10న ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లాలూ తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై తక్షణం విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్, సీబీఐ దీనిపై సమాధానం ఇవ్వాలని కోరారు.