తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు - చట్టం

7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ. లక్ష వరకు జరిమానా విధించింది. మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుపై తమ స్పందన తెలియజేయాలని గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి రూ. 50 వేలు జరిమానా పడింది.

7 రాష్ట్రాలకు జరిమానా- తెలంగాణకు రూ.50 వేలు

By

Published : Aug 13, 2019, 7:33 PM IST

Updated : Sep 26, 2019, 9:48 PM IST

ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని 2018 జనవరి 4న సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని 7 రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం రూ.లక్ష వరకు జరిమానా విధించింది.

మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. ఏఏ రాష్ట్రాలు ఈ అంశంపై తమ స్పందనలు తెలియజేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ఇవ్వలేదని తెలుసుకున్న ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాల లోపు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.

Last Updated : Sep 26, 2019, 9:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details