తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొగతో ఎందుకు? ఒకేసారి బాంబులతో చంపేయండి: సుప్రీం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రజలు గ్యాస్​ ఛాంబర్లలో నివసించాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. దీనికంటే ఒకే సారి 15 బ్యాగులలో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి అందరినీ చంపేయడం మేలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.

పొగతో ఎందుకు? ఒకేసారి బాంబులతో చంపేయండి: సుప్రీం

By

Published : Nov 25, 2019, 5:21 PM IST

దిల్లీలో వాయుకాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఏ మాత్రం లెక్కలేదని మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు గ్యాస్ ఛాంబర్లలో నివసించాల్సిన దుస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. దీనికి బదులు 15 సంచులలో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి ప్రజలందరినీ ఒకేసారి చంపేయడం మేలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతను నియంత్రించాలని పంజాబ్​, హరియాణా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినా.. ఇంకా ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించింది సుప్రీం. ఈ వైఫల్యాన్ని ఎందుకు సహించాలని నిలదీసింది. ఇది అంతర్యుద్ధం కంటే దయనీయ పరిస్థితి కాదా అని వ్యాఖ్యానించింది. కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోయేందుకు అనుమతించాలా అని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది సుప్రీం. దిల్లీ ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేసింది.

తాగు నీరు, గాలి ప్రజల ప్రాథమిక హక్కులని.. వాటిని కూడా ప్రజలకు అందించలేని ప్రభుత్వాలు ఎందుకని తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం. దేశ రాజధానిలో తాగునీరు కలుషితమైందనే విషయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పింది.

ఇదీ చూడండి:ఐదేళ్ల పాటు ఆ ఇద్దరు ఎంపీలు సస్పెండ్​​!

ABOUT THE AUTHOR

...view details