విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కల్పనను బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై మహారాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది సుప్రీంకోర్టు.
మరాఠాల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నోటీసులు - marathas
మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది సుప్రీంకోర్టు. అయితే స్టే విధించేందుకు నిరాకరించింది. రిజర్వేషన్ల అమలును బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
మరాఠాల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందన కోరిన సుప్రీం
మరాఠాలకు రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ ప్రామాణికతను బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ 2014 నుంచి రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న నిర్ణయాన్ని అమలు చేయవద్దని సుప్రీం ఆదేశించింది.