తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇనుప గనుల తవ్వకాలపై కేంద్రానికి నోటీసులు

దేశవ్యాప్తంగా 358 ఇనుప గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వేలం వేయకుండా, నాయకులు విరాళాలు తీసుకుని ఈ గనులను లీజుకిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

By

Published : Apr 16, 2019, 11:33 PM IST

ఇనుప గనుల తవ్వకాలపై కేంద్రానికి నోటీసులు

358 ఇనుప గనుల తవ్వకాలపై అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. జస్టిస్ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎస్​ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం గనుల తవ్వకాలపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

సరైన విధానాలు పాటించకుండా గనుల తవ్వకాలకు ఉచితంగా అనుమతులిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. వేలంపాట నిర్వహించలేదని, నాయకులు భారీగా విరాళాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.4 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

వెంటనే అనుమతులను రద్దు చేసి, నష్టాన్ని ప్రస్తుత మార్కెట్​ విలువతో లెక్కించి తిరిగి కట్టించాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details