ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో - జమ్ముకశ్మీర్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దు, ఆ ప్రాంతంలో ఆంక్షల విధింపుపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వులపై అత్యవసర విచారణ చేపట్టాలన్న పిటిషనర్​ వినతిని సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత సయమంలో విచారించనున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం నో
author img

By

Published : Aug 8, 2019, 12:52 PM IST

'ఆపరేషన్​ కశ్మీర్'​పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఆర్టికల్​ 370 రద్దుపై...

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేస్తూ ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలయింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనరైన న్యాయవాది ఎంఎల్​ శర్మ కోరారు. ఆగస్టు 12 లేదా 13న విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆంక్షల తొలగింపునకు..

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు కోసం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలు సడలించి, కర్ఫ్యూ ఎత్తివేయాలని పిటిషన్​ దాఖలు చేశారు కాంగ్రెస్​ కార్యకర్త తెహ్​సీన్​ పూనావాలా. కశ్మీర్​లో సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు, అరెస్ట్​ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కశ్మీర్​ పరిస్థితులపై కమిషన్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రెండు పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్​ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనానికి పంపనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

ABOUT THE AUTHOR

...view details