తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దోశల రాజుకు గడువు ఇచ్చే ప్రసక్తే లేదు' - హత్య

'శరవణ భవన్'​ అధినేత పి.రాజగోపాల్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. జైలు జీవితం ప్రారంభించేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా మరింత గడువు కోరగా న్యాయస్థానం తిరస్కరించింది.

పి.రాజగోపాల్

By

Published : Jul 9, 2019, 2:05 PM IST

Updated : Jul 9, 2019, 5:13 PM IST

శరవణ్​ భవన్​తో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హోటళ్ల యజమాని పి.రాజగోపాల్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. చిన్న కుటుంబంలో పుట్టి అంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రాజగోపాల్​కు... ఒక దురాశ కారణంగా యావజ్జీవ శిక్ష పడింది. పోలీసులకు లొంగిపోయేందుకు ఆరోగ్య కారణాలతో సమయం కోరగా జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

రాజగోపాల్​కు జులై 7న జైలు శిక్ష ప్రారంభం కావాల్సి ఉంది.

నేపథ్యం

పి.రాజగోపాల్‌! ఇడ్లీ, వడ, దోశలను వేడివేడిగా వడ్డించి దక్షిణ భారతాన్ని తృప్తి పరిచిన ‘దోశల రాజు’ ఆయన. లండన్‌, న్యూయార్క్‌, సింగపూర్‌, సిడ్నీ, స్టాక్‌హోం... ఏ ప్రపంచ స్థాయి నగరాన వెతికినా 'శరవణ్‌ భవన్​' దొరికి తీరుతుంది. అంతలా ప్రాచుర్యం పొందింది. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో ఉల్లిపాయలు అమ్ముకునే కుటుంబం. 1981లో పొట్టచేత పట్టుకుని చెన్నై వచ్చి కిరాణా దుకాణం పెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి పలు దేశాల్లో 80కి పైగా శాఖలను ప్రారంభించాడు.

ఇదీ కేసు

తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను మూడో వివాహం చేసుకుంటే ఇంకా బాగా కలిసొస్తుందని ఓ జ్యోతిషుడు చెబితే... రాజగోపాల్‌ నమ్మాడు. ఆ మాయలో పడి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే పెళ్లయినందున ఆమె అంగీకరించలేదు. చివరి ప్రయత్నంగా 2001లో ఆమె భర్తను చంపించాడు రాజగోపాల్‌!

కింది కోర్టు ఆయనకు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలుచేయగా... శిక్షను యావజ్జీవంగా ఖరారు చేసింది.

ఇదీ చూడండి: దొంగ కోసం రైల్లో నుంచి దూకితే ప్రాణం పోయింది

Last Updated : Jul 9, 2019, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details