జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ల స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
"కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని భద్రతా చర్యలను అధికారులు తీసుకుంటారు. ఇప్పుడు అంతా అయిపోయింది. సమీక్ష కోసం వచ్చిన పిటిషన్లు కూడా కొట్టివేశాం. ఇప్పటికే జేఈఈ పరీక్షలు నిర్వహించారు. క్షమించాలి.. ఈ పిటిషన్లను స్వీకరించేందుకు సిద్ధంగా లేము."
- సుప్రీంకోర్టు
పిటిషన్‌దారుల తరఫు న్యాయవాదులు పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.