తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్వదినాలలో ఓటు వేయలేరా: సుప్రీం - Puducherry

తమిళనాడు, పుదుచ్చేరిలో లోక్​సభ ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. పర్వ దినాల్లో మీరు ఓటు వేయలేరా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రార్థనలు ఎలా చేసుకోవాలో, ఓటు ఎలా వేయాలో మేము సలహాలు ఇవ్వాలనుకోవట్లేదని చురకలు అంటించింది.

వాయిదా కోరిన వారిపై సుప్రీం ఆగ్రహం

By

Published : Apr 4, 2019, 1:48 PM IST

లోక్​సభ ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్​పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని క్రిస్టియన్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుడ్​ఫ్రైడే, ఈస్టర్ లాంటి​ పవిత్రమైన రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో నిర్వహించే ఎన్నికలను వాయిదావేసి రీషెడ్యూల్​ చేయాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీం కోర్టు. జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

"పవిత్ర రోజుల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరా? ప్రార్థనలు ఎలా చేయాలి, ఓటు ఎలా వేయాలి అని మేము సలహాలు ఇవ్వాలనుకోవట్లేదు" - సుప్రీం ధర్మాసనం.

ABOUT THE AUTHOR

...view details