జులైలో జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దుకు సుప్రీం ఓకే - cbse class 12 exams news
11:14 June 26
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దుకు సుప్రీం ఓకే
జులై 15నాటికి ఫలితాలు..
జులై 15నాటికి 10,12వ తరగతి విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కోర్టుకు తెలిపాయి. ఫలితాల పట్ల సంతృప్తి చెందని 12వ తరగతి విద్యార్థులకు కావాలంటే తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ అధికారి భరద్వాజ్ తెలిపారు. చివరగా ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
10వ తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది సీబీఎస్ఈ. గత మూడు బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయిస్తామని పేర్కొంది.
కరోనా నేపథ్యంలో దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు గురువారం తెలియజేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయాలని వినతి చేసింది.