తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసుపై నేడు విచారణ - కేసు

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ​ కోర్టు ధిక్కరణ పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రఫేల్​ తీర్పులో లేని వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించి రాహుల్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా ఎంపీ మీనాక్షి లేఖి పిటిషన్​ వేశారు. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ రెండు సార్లు అఫిడవిట్​ దాఖలు చేశారు.

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసులో నేడు విచారణ

By

Published : Apr 30, 2019, 7:08 AM IST

Updated : Apr 30, 2019, 8:54 AM IST

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసులో నేడు విచారణ

రఫేల్​ తీర్పులో లేని వ్యాఖ్యలను న్యాయస్థానానికి ఆపాదించి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా ఎంపీ మీనాక్షి లేఖి వేసిన పిటిషన్​ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది.

కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీంకోర్టులో రాహుల్​ గాంధీ సోమవారం మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. రఫేల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు రాహుల్.

రాజకీయ దురుద్దేశంతోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారని ధర్మాసనానికి తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు. రఫేల్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 'కాపలాదారు దొంగ' అని నిర్ధరణ అయిందని రాహుల్​ గాంధీ గతంలో మోదీని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న రాహుల్​కు సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Last Updated : Apr 30, 2019, 8:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details