ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఈడీ అరెస్టు నుంచి కల్పించిన మధ్యంతర రక్షణను గురువారం వరకు పొడిగించింది సుప్రీంకోర్టు.
జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఎదుట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం తనను తాను బాధితుడిగా చిత్రీకరించుకుంటున్నారని... కేసు విషయంలో అరెస్టు చేయకుండా ఈడీని నిలువరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
"ప్రతివాదులు ఆరోపిస్తున్నట్లుగా ఇది కక్షసాధింపు కాదు. మనీ ల్యాండరింగ్ కేసులో మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి."