శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ గడువు పొడిగించాలన్న కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన ఏడు రోజుల రక్షణ గడువు శుక్రవారంతో ముగియనుంది.
కోల్‌కతా మాజీ సీపీ 'రాజీవ్' పిటిషన్ తిరస్కరణ - SC
కోల్‌కతా మాజీ సీపీ రాజీవ్ కుమార్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ గడువు పొడిగించాలన్న రాజీవ్ అభ్యర్థనపై విచారించేందుకు నిరాకరించింది.
కోల్‌కతా మాజీ కమిషనర్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
అరెస్టు నుంచి రక్షణ కోసం కోల్‌కతా హైకోర్టు, ట్రయల్ కోర్టులను ఆశ్రయించవచ్చని రాజీవ్‌కు సూచించింది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.
ఇదీ చూడండి: కోచింగ్ సెంటర్లో మంటలు.. 15 మంది విద్యార్థులు మృతి..