తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'1 కాదు... 5 వీవీప్యాట్​ రసీదులు లెక్కించండి' - Chief Justice

ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్​ రసీదులను లెక్కించి, ఈవీఎం ఫలితంతో సరిపోల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నేతృత్వంలో విపక్ష నేతలు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈమేరకు తీర్పునిచ్చింది.

'1 కాదు... 5 వీవీప్యాట్​ రసీదులు లెక్కించండి'

By

Published : Apr 8, 2019, 1:56 PM IST

Updated : Apr 8, 2019, 3:25 PM IST

'1 కాదు... 5 వీవీప్యాట్​ రసీదులు లెక్కించండి'

ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్​ ఈవీఎంల రసీదులు లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓట్ల స్లిప్పుల లెక్కింపుపై విపక్షాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం ఈమేరకు తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత పెంచేందుకు ఎక్కువ ఈవీఎంల రసీదులు లెక్కించడం మంచిదని అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక వీవీప్యాట్​ రసీదులను మాత్రమే లెక్కించి, ఈవీఎంలో వచ్చిన ఓట్ల లెక్కతో సరిపోల్చుతున్నారు.

ఇదీ కథ...

ఎలక్ట్రానిక్​ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం ఈవీఎంల్లో పోలైన ఓట్లను వీవీప్యాట్​ స్లిప్పులతో సరిపోల్చాలని కోరాయి.
విపక్షాల అభ్యర్థనపై ఈసీ అభ్యంతరం తెలిపింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యపడదని తేల్చిచెప్పింది. అందుకు మౌలిక వసతులు, మానవ వనరులు సమస్య ఎదురవుతుందని పేర్కొంది.

వీవీప్యాట్​ స్లిప్​లు లెక్కిస్తే ఎన్నికల ఫలితాలు 5.2 రోజులు ఆలస్యమవుతుందన్న ఈసీ వివరణపై విపక్షాలు కౌంటర్ దాఖలు చేశాయి. ఫలితాలు ఆరు రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదని, వీవీప్యాట్ స్లిప్పులను తప్పక లెక్కించాలని కోరాయి.

రసీదుల లెక్కింపుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒకటికి బదులు 5 వీవీప్యాట్​ ఈవీఎంల రసీదులు లెక్కించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి: భారత్​@75 కోసం భాజపా 75 ప్రతిజ్ఞలు

Last Updated : Apr 8, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details