తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: ఉన్నావ్ కేసు​ విచారణకు 45 రోజుల డెడ్​లైన్​ - అత్యాచార

లైవ్​: ఉన్నావ్​ అత్యాచార ఘటనపై సుప్రీం విచారణ

By

Published : Aug 1, 2019, 11:31 AM IST

Updated : Aug 1, 2019, 3:35 PM IST

14:32 August 01

సుప్రీం కీలక ఆదేశాలు...

ఉన్నావ్‌ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్‌ కేసుకు సంబంధించిన 5 కేసులను దిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లో మొత్తం విచారణ పూర్తి చేయాలని ట్రయల్‌ కోర్టుకు తెలిపింది. బాధితురాలి కారు ప్రమాద ఘటనపై 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశించింది.

బాధితురాలిని దిల్లీకి తరలించడంపై వారి కుటుంబమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది. బాధితురాలికి, ఆమె న్యాయవాదికి చెరో రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్‌ బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపింది.

14:25 August 01

భద్రత కట్టుదిట్టం...

ఉన్నావ్​ కేసు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తక్షణం పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

14:17 August 01

దిల్లీ సీబీఐకి బదిలీ...

ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించిన 5 కేసులను దిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం ఆదేశించింది. బాధితురాలి కారు ప్రమాదంపై వారంలోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశం

13:00 August 01

2 గంటలకు నిర్ణయం...

'ఉన్నావ్'​ కేసుల తరలింపు, బాధితురాలు, ఆమె న్యాయవాదికి మెరుగైన వైద్యం సహా కేసు పురోగతిపై మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి పేర్కొన్నారు.

12:54 August 01

బాధితురాలిని తరలించే అవకాశం...

ఉన్నాావ్​ ఘటన బాధితురాలిని దిల్లీ ఎయిమ్స్​కు తరిలించేందుకు సుప్రీం ఆదేశించే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్య స్థితిపై సుప్రీం ఆరా తీసింది.

12:50 August 01

వారం రోజుల్లో...

ఉన్నావ్​ కేసులో దర్యాప్తునకు ఎంత సమయం కావాలో తెలియజేయాలని సొలిసిటర్​ జనరల్​న్​ సుప్రీం ప్రశ్నించింది. నెల గడువు కావాలని సొలిసిటరీ జనరల్​ కోరగా... వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.

12:44 August 01

కోర్టు ముందుకు సీబీఐ...

ఉన్నావ్ అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో  విచారణ తిరిగి ప్రారంభమైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనా కోర్టుకు హాజరయ్యారు. ఉన్నావ్ అత్యాచార కేసు వివరాలను సుప్రీం కోర్టుకు సొలిసిటర్​ జనరల్‌ అందజేశారు. మొత్తం 4 ఎఫ్ఐఆర్‌ల వివరాలు తెలియజేశారు.

12:37 August 01

నిందితుడిపై భాజపా వేటు...

ఉన్నావ్‌ అత్యాచార ఘటన నిందితుడు ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌పై భాజపా వేటు వేసింది. పార్టీ నుంచి కుల్దీప్‌ సింగ్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

12:08 August 01

భద్రతా సిబ్బందిపై వేటు...

ఉన్నావ్​ ఘటన బాధితురాలికి భద్రతగా నియమించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఇద్దరిని సస్పెండ్​ చేశారు.

11:44 August 01

12 గంటల్లోగా తెలియజేయాలి...

ఈ కేసులో పురోగతి నివేదికతో సంబంధమున్న సీబీఐ అధికారి కోర్టుకు హాజరుకావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటల్లోగా అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాదం కేసు వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి అన్ని కేసులు ఉత్తరప్రదేశ్‌ నుంచి దిల్లీకి బదిలీ చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది

11:40 August 01

'ఉన్నావ్' కేసులు యూపీ నుంచి బదిలీ...​

సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసుని విచారిస్తున్న సీబీఐ అధికారి ప్రస్తుతం లఖ్‌నవూలో ఉన్నారని, మధ్యాహ్నం 12 గంటల్లోపు కోర్టు ముందు హాజరు కావడం అసాధ్యమని సొలిసిటర్‌ జనరల్ తెలిపారు. విమానంలో వచ్చినా నిర్దేశిత సమయానికి చేరుకోవడం కష్టమని చెప్పారు. అందువల్ల కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. సీబీఐ డైరెక్టర్ సదరు అధికారితో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవచ్చని, మధ్యాహ్నం తప్పనిసరిగా వివరాలు అందజేయాలి’ అని గొగొయి స్పష్టం చేశారు. ఉన్నావ్‌ ఘటనకు సంబంధించి అన్ని కేసులను యూపీ వెలుపలకు బదిలీ చేస్తామని, సీబీఐ అధికారి నుంచి వివరాలు తీసుకున్న తర్వాత దీనిపై తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం వెల్లడించింది

11:38 August 01

విచారణ వేగవంతం...

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి చేయించారనే అభియోగంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలిని లారీతో ఢీకొట్టి చంపించాలని యత్నించారనే అభియోగాలపై ఉత్తరప్రదేశ్‌ భాజపా ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌, ఆయన బంధువులతో సహా తొమ్మిది మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. దీంతోపాటు తనకు రక్షణ కల్పించాలని బాధితురాలి కుటుంబం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్‌ గొగొయికి రాసిన లేఖను సుమోటాగా తీసుకున్న న్యాయస్థానం వీటిపై నేడు విచారణ జరిపింది.

11:34 August 01

సుప్రీం డెడ్​లైన్...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో పురోగతి నివేదికతో సంబంధమున్న సీబీఐ అధికారి కోర్టుకు హాజరుకావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటల్లోగా అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాదం కేసు వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి అన్ని కేసులు ఉత్తరప్రదేశ్‌ నుంచి దిల్లీకి బదిలీ చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది.

11:21 August 01

  • ఉన్నావ్ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
  • సీబీఐ అధికారి కోర్టుకు హాజరుకావాలని సీజేఐ ఆదేశం
  • మధ్యాహ్నం 12 గంటలలోపు కేసు వివరాలు తెలియజేయాలన్న సుప్రీంకోర్టు
  • అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాదం కేసు వివరాలు తెలియజేయాలన్న సుప్రీంకోర్టు
  • సీబీఐ డైరెక్టర్‌తో కేసుపై చర్చించాలని సొలిసిటరీ జనరల్‌కు ఆదేశం
  • అన్ని కేసులను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తామన్న సుప్రీం
  • కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు దిల్లీలో లేరన్న సొలిసిటరీ జనరల్
  • సాయంత్రంలోగా వివరాలు తెప్పిస్తామన్న సొలిసిటరీ జనరల్
  • రేపటికి విచారణ వాయిదా వేయాలని కోరిన సొలిసిటరీ జనరల్
  • నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • అక్కడి నుంచి వివరాలు ఫోన్లో మాట్లాడైనా తెప్పించుకోవచ్చన్న సుప్రీంకోర్టు
  • మధ్యాహ్నం తప్పనిసరిగా వివరాలు తెలియజేయాలని ఆదేశం
  • ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబం రాసిన లేఖ ఆధారంగా విచారణ
Last Updated : Aug 1, 2019, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details