ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్దేశించిన రుసుముల ప్రకారం.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. తామేమీ ఉచితంగా చికిత్స అందించమని కోరడం లేదని స్పష్టం చేసింది.
ఉచితంగా చికిత్స!
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్-19 చికిత్స ఫీజులను నియంత్రించాలని దాఖలైన పిటిషన్పై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం నుంచి రాయితీగా భూమి పొందిన ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం నిర్దిష్ట బాధితుల వరకు ఉచితంగా చికిత్స అందించాలని సూచిస్తున్నట్లు స్పష్టం చేసింది.