తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐఎన్​ఎక్స్​ కేసు': చిదంబరం కస్టడీ రేపటి వరకు పొడిగింపు - SUPREME COURT

చిదంబరానికి స్వల్ప ఊరట

By

Published : Sep 2, 2019, 1:57 PM IST

Updated : Sep 29, 2019, 4:13 AM IST

17:57 September 02

చిదంబరం కస్టడీ రేపటి వరకు పొడిగింపు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కస్టడీని రేపటి వరకు పొడిగించింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. ఆయన మధ్యంతర బెయిల్​ పిటిషన్​పైనా రేపు విచారణ చేపట్టనుంది. 

చిదంబరానికి గతంలో ఆగస్టు 30న విధించిన సీబీఐ కస్టడీ పొడిగింపు నేటితో ముగిసింది. అనంతరం.. సీబీఐ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా అభ్యర్థన అనంతరం... చిదంబరం కస్టడీని రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు వెలువరించింది. 

17:15 September 02

చిదంబరం కస్టడీ పొడిగింపు అంశంపై కొద్దిసేపట్లో నిర్ణయం

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనపై మరికొద్దిసేపట్లో నిర్ణయం ప్రకటించనుంది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. చిదంబరానికి సీబీఐ కస్టడీ నేటితో ముగిసినందున దిల్లీ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 

16:51 September 02

చిదంబరం బెయిల్​ పిటిషన్​ను వ్యతిరేకించిన సీబీఐ

చిదంబరానికి ఊరట అంశాన్ని సీబీఐ వ్యతిరేకిస్తుంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు విచారణలో భాగంగా.. చిదంబరం కస్టడీని మరొకరోజు పొడిగించాలని దిల్లీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. 

ఆగస్టు 30న చిదంబరానికి పొడిగించిన 3 రోజుల కస్టడీ నేటితో ముగిసిన అనంతరం కాంగ్రెస్​ సీనియర్​ నేతను దిల్లీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

ఆగస్టు 21న అరెస్టయిన కేసులో మధ్యంతర బెయిల్​ పిటిషన్​ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు చిదంబరం. చిదంబరం బెయిల్​ పిటిషన్​పై మరికొంత సమయం ఇవ్వాలని కోరారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. చట్టబద్ధంగా అవసరం కనుక.. సీబీఐకి నోటీసులు జారీ చేశామని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరునికీ సమానమేనని కోర్టులో తెలిపారు మెహతా. 

16:42 September 02

కొంత సమయం కావాలి: మెహతా

చిదంబరం మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై బదులివ్వడానికి కొంత సమయం కోరారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. 

16:35 September 02

దిల్లీ ప్రత్యేక కోర్టులో చిదంబరం

చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియడంతో.. ఆయనను దిల్లీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఆయన రిమాండ్​ను రేపటివరకు పొడిగించాలని కోరుతోంది సీబీఐ.  

15:50 September 02

చిదంబరం కేసులో ఆదేశాలు సవరించిన సుప్రీం కోర్టు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆదేశాలను సవరించింది సుప్రీం కోర్టు. చిదంబరం కస్టడీని సెప్టెంబర్​ 5 వరకు పొడిగించుకోవచ్చన్న ఆదేశాలపై.. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ కస్టడీని రేపటి వరకే కోరతామని మెహతా అభ్యర్థించారు. 

పిటిషన్​ను రేపే మరోసారి విచారించాలని కోరారు సొలిసిటర్​ జనరల్​. చిదంబరం సీబీఐ కస్టడీని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై రేపు మరోసారి విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం. 

సీబీఐ కస్టడీని రేపటి వరకు పొడిగించుకోవడం కోసం.. లోయర్​ కోర్టుకు వెళ్లే అంశంపై సీబీఐకే వదిలేసింది చేసింది సుప్రీం. 

14:05 September 02

'బెయిల్​ ఇవ్వకుంటే మరో 3 రోజులు సీబీఐ కస్టడీ'

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్​ మంజూరు చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని విచారణ న్యాయస్థానాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.

ఒకవేళ బెయిల్​ అభ్యర్థనను విచారణ న్యాయస్థానం తిరస్కరించినా... ఆయన్ను తీహార్ జైలుకు పంపరాదని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. బెయిల్ రాని పక్షంలో చిదంబరం సీబీఐ కస్టడీని గురువారం వరకు మాత్రమే పొడిగించాలని స్పష్టంచేసింది.

ఐఎన్​ఎక్స్​ కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీచేయడం సహా విచారణ కోర్టు సీబీఐ కస్టడీకి ఆదేశించడాన్ని సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. చిదంబరం పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని  ఆదేశిస్తూ సీబీఐకి తాఖీదులిచ్చింది.

సిబల్​ వాదనలు...

చిదంబరం తరఫున కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చిదంబరం వయసు 74ఏళ్లని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ను గృహ నిర్బంధంలో పెట్టాలని కోరారు.

13:59 September 02

చిదంబరం వయసును దృష్టిలో పెట్టుకోండి: సిబల్​

ఐఎన్​ఎక్స్​ కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీచేయడం సహా విచారణ కోర్టు సీబీఐ కస్టడీకి ఆదేశించడాన్ని సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. చిదంబరం పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని  ఆదేశిస్తూ సీబీఐకి తాఖీదులిచ్చింది.

సిబల్​ వాదనలు...

చిదంబరం తరఫున కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చిదంబరం వయసు 74ఏళ్లని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ను గృహ నిర్బంధంలో పెట్టాలని కోరారు.

13:48 September 02

ఐఎన్​ఎక్స్​ మీడియా: దిల్లీ ప్రత్యేక కోర్టులో చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్​ మంజూరు చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని విచారణ న్యాయస్థానాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.

ఒకవేళ బెయిల్​ అభ్యర్థనను విచారణ న్యాయస్థానం తిరస్కరించినా... ఆయన్ను తీహార్ జైలుకు పంపరాదని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. బెయిల్ రాని పక్షంలో చిదంబరం సీబీఐ కస్టడీని గురువారం వరకు మాత్రమే పొడిగించాలని స్పష్టంచేసింది.

Last Updated : Sep 29, 2019, 4:13 AM IST

ABOUT THE AUTHOR

...view details