తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

సార్వత్రిక ఎన్నికల మిగిలిన దశల పోలింగ్​ సమయం మార్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రంజాన్​ మాసం దృష్ట్యా పోలింగ్​ను ఉదయం 5 గంటల నుంచి నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది.

'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

By

Published : May 2, 2019, 3:19 PM IST

Updated : May 2, 2019, 5:19 PM IST

'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా మిగిలి ఉన్న విడతల్లో పోలింగ్​ను ఉదయం 5 గంటల నుంచి నిర్వహించాలన్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. ఎండవేడి, రంజాన్​ దృష్ట్యా పోలింగ్​ సమయాన్ని ముందుకు జరపాలంటూ దాఖలైన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగోయ్​ నేతృత్వంలోని ధర్మాసనం తక్షణ విచారణ చేపట్టింది.

పిటిషన్​ దాఖలు చేసిన మహ్మద్​ నిజాముద్దీన్​ పాషా, అసద్​ హయత్​ అనే న్యాయవాదులు.... ఈ విషయంపై ఎన్నికల సంఘానికి విన్నవించినప్పటికీ స్పందించలేదని తెలిపారు.

Last Updated : May 2, 2019, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details