తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ, షాపై ఫిర్యాదుల అంశంలో సోమవారంలోగా నిర్ణయం' - జస్టిస్​ రంజన్​ గొగొయ్

నరేంద్ర మోదీ, అమిత్​షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్న కాంగ్రెస్ ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఫిర్యాదులపై సోమవారంలోగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

'మోదీ, షా కేసులపై సోమవారంలోగా నిర్ణయం'

By

Published : May 2, 2019, 5:38 PM IST

Updated : May 2, 2019, 8:41 PM IST

'మోదీ, షాపై ఫిర్యాదుల అంశంలో సోమవారంలోగా నిర్ణయం'

ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్​ చేసిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఫిర్యాదులపై సోమవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

మోదీ, అమిత్​షాపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్​​ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్​ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

తమకు అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని, మిగతా 9 ఫిర్యాదులపై స్పందించేందుకు సమయం కావాలని ఈసీ కోరింది. సోమవారం వరకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష

Last Updated : May 2, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details