తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇక నుంచి ఏటా పటేల్​ జాతీయ ఐక్యతా అవార్డులు

పద్మ అవార్డుల మాదిరిగా ఇకపై దేశ సమగ్రత కోసం పనిచేసే వ్యక్తులు,సంస్థలకు సర్దార్​ పటేల్​ జాతీయ ఐక్యతా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలను తెలిపింది.

By

Published : Sep 21, 2019, 8:37 AM IST

Updated : Oct 1, 2019, 10:11 AM IST

ఏటా సర్దార్​ పటేల్​ జాతీయ అవార్డు

పద్మ అవార్డుల మాదిరిగా ఇకపై సర్దార్​ పటేల్​ జాతీయ ఐక్యతా అవార్డులను ప్రదానం చేయనుంది కేంద్రం. దేశ ఐక్యత, సమగ్రత, చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. భారత తొలి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్​పటేల్​ దేశ ఐక్యతకు చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా ఆయన పేరిట అవార్డు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది డిసెంబర్​ 23న ప్రకటించారు. ఈ మేరకు విధి విధానాలను కేంద్ర హోంశాఖ తెలిపింది.

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేసే ఈ అవార్డు రూపురేఖలను వెల్లడించింది హెంశాఖ . శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో దీన్ని రూపొందిస్తారు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డును మరణానంతరం ప్రకటిస్తారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ ఈ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎంపిక చేస్తుంది.

ఇదీ చూడండి:'ప్రతిపక్ష నేతలకు అయితే జైలు లేదా బెయిల్'

Last Updated : Oct 1, 2019, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details