బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సంస్కృత భాషలో అతడికున్న నైపుణ్యం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.
వైరల్ అయిన వీడియోలో క్యాబ్‌లో కూర్చున్న వ్యక్తితో తనను మల్లప్పగా పరిచయం చేసుకున్నాడు డ్రైవర్. ఎంతో చక్కగా సంస్కృత భాషలో సంభాషించాడు. ఈ భాషలో పీజీ పూర్తి చేసినట్లు తెలిపాడు.
సంస్కృతాన్ని కాపాడేందుకే తాను ఆ భాషలో మాట్లాడుతున్నట్లు చెప్పాడు మల్లప్ప.
మల్లప్పను ప్రశంసిస్తూ ఈ వీడియోనూ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
"అద్భుతం. మల్లప్ప సంభాషణ చాలా బాగుంది. వినసొంపుగా ఉంది. సంస్కృతాన్ని అధికారిక భాష చేయాలని చర్చ జరుగుతన్న సమయంలో మద్దతు పలికిన మొదటి వ్యక్తి."
-కస్తూరి శంకర్, కన్నడ నటి
"బెంగళూరులో సంస్కృతం మాట్లాడే క్యాబ్ డ్రెవర్ ఉన్నాడు. ఆయనకు నమస్కారం."
-గిరీష్, నెటిజన్
ఈ ట్వీట్‌పై మరో వ్యక్తి స్పందిస్తూ.. "ఆశ్చర్యపోవద్దు! బెంగళూరులో సంస్కృతమే కాదు ప్రోగ్రామింగ్ కోడ్ రాయగలిగే క్యాబ్ డ్రైవర్లూ ఉంటారు" అని పోస్ట్ చేశాడు.
సంస్కృతంలో అదరగొట్టే కన్నడ క్యాబ్ డ్రైవర్
ఇదీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై 10 మంది దాడి