తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వనిత' కోసం సైకతశిల్పం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వినూత్నంగా వనితలకు మద్దతు తెలుపుతున్నారు కళాకారులు. 'మహిళలను గౌరవించాలి, స్వేచ్ఛనివ్వాలి' అనే ఇతివృత్తాలతో శిల్పాలు రూపొందించారు ఒడిశా సైకతశిల్పులు.

'వనిత' కోసం సైకతశిల్పం

By

Published : Mar 8, 2019, 1:34 PM IST

'వనిత' కోసం సైకతశిల్పం
ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వారి హక్కుల కోసం మహిళలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఒడిశా సైకత కళాకారులు వివిధ ఆకృతుల్లో శిల్పాలు రూపొందించారు. పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని, పూర్తి స్వేచ్ఛనివ్వాలనే ప్రత్యేక సందేశాలతో వీటిని తీర్చిదిద్దారు. పూరీ బీచ్​ తీరాన కొలువుదీరిన ఈ కళాఖండాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

'నాకు రెక్కలిచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించే స్వేచ్ఛనివ్వండి' అనే సందేశంతో రూపొందిన కళాఖండం ప్రత్యేకంగా నిలిచింది. శిల్పి మానస్​కుమార్​ ఈ శిల్పాన్ని చెక్కారు.

ఇవీచూడండి:

సైకత శిల్పాలు రూపొందించటంలో ప్రసిద్ధులైన సుదర్శన్​ పట్నాయక్​, మానస్​ కుమార్​లు మహిళల్లో స్ఫూర్తి నింపేలా ఆకృతులను తీర్చిదిద్దారు. ''థింక్​ ఈక్వల్​, బిల్డ్ స్మార్ట్​, ఇన్నోవేట్​ ఫర్​ ఛేంజ్''​ అనే సందేశాన్ని ట్విట్టర్​లో జోడించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పట్నాయక్.

ABOUT THE AUTHOR

...view details