సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది పంచకులలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం.
'సంఝౌతా' పేలుడు కేసులో నిర్దోషిగా అసిమానంద - సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో హరియాణా పంచకులలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది.
2007 ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన సంఝౌతా పేలుడులో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్ వాసులే ఉన్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్తుండగా పానిపట్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ 8 మందిని ఎఫ్ఐర్లో నిందితులుగా చేర్చింది. అయితే న్యాయస్థానం ముందు మాత్రం నలుగురునే ప్రవేశపెట్టింది. వీరిలో స్వామి అసిమానందతో పాటు లోకేష్ శర్మ, కమల్ చౌహాన్, రాజేందర్ చౌదరి ఉన్నారు. వీరందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 2010 వరకు ఈ కేసును సిట్ విచారించింది. ఆ తర్వాత ఎన్ఐఏ చేతికి వచ్చింది.