అసోం తిన్సుకియాకు చెందిన భూపెన్ లిక్సన్కు సల్మాన్‌ఖాన్ అంటే మహా ఇష్టం. ఎంతంటే.. సల్మాన్‌ను కలిసేందుకు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసేంత! అవును, తన అభిమాన హీరో గువహటికి వస్తున్నాడని తెలుసుకుని సైకిల్ పెడల్‌కు పని చెప్పాడు. ఐదు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని భాయ్ కోసం వేచి చూస్తున్నాడు.
"నేను నా ప్రయాణాన్ని ఈ నెల 8న జగూన్ నుంచి ప్రారంభించా. గువహటిలో జరుగుతున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డు కార్యక్రమానికి హాజరవుతున్న సల్మాన్‌ఖాన్‌ను కలిసేందుకే సైకిల్‌పై వచ్చా."