తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 23 నుంచి దేశంలో యూపీఏ సర్కార్: పైలట్​ - హింస

రాజకీయాల కోసం దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు రాజస్థాన్​ ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​. 2014తో పోలిస్తే దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికలు, వ్యూహాలు, ప్రచారం సహా మరిన్ని విషయాలను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు సచిన్​ పైలట్​.

మే 23 నుంచి దేశంలో యూపీఏ సర్కార్:పైలట్​

By

Published : May 6, 2019, 12:00 AM IST

భాజపా నేతలు ఓడిపోతామనే నిరాశతో ప్రజల మధ్య చీలిక తెచ్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు రాజస్థాన్​ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్. ఏం చేసినా భాజపా పాచికలు పారవని, మే 23న కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, భాజపా పాలనపై వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడారు.

ఏం మాట్లాడినా.. సమస్యలే ప్రధానాంశాలు

చెప్పేందుకు ఏమీ లేక భాజపా నేతలు... మందిరం-మసీదు, అలీ-భజరంగ్​బలి, జాతీయవాదం అంటున్నారని ఎద్దేవా చేశారు సచిన్​ పైలట్​. వాటిని ప్రజలు పట్టించుకోరని అన్నారు. అభివృద్ధిలో వెనుకబాటు, భాజపా నెరవేర్చని హామీలే ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు సచిన్​ పైలట్​.

పరిస్థితి మారింది

2014తో పోలిస్తే దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు సచిన్​. ఇప్పుడసలు మోదీ పవనాలు అనే మాటే లేదని స్పష్టం చేశారు. హిందీ రాష్ట్రాల్లోనూ ఈసారి భాజపాకు పరాభవం తప్పదన్నారు.

హింస పెరిగింది

భాజపా పాలనతో దేశంలో హింస పెరిగిపోయిందని ఆరోపించారు సచిన్​ పైలట్​.

" ఐదేళ్ల క్రితం మూకదాడులు, గోరక్షకుల దాడులు అనే మాటలు, చర్చే లేవు. అలాంటి చర్యలకు కొన్ని శక్తులు మద్దతునిస్తున్నాయి. గత ఐదేళ్లలో విద్వేష పూరిత దాడులు, హింస దేశంలో పెరిగిపోయాయి. ఇది దేశానికి మంచిది కాదు. " - సచిన్​ పైలట్​, రాజస్థాన్​ ఉపముఖ్యమంత్రి

ఎన్నికల తర్వాతే నాయకత్వంపై నిర్ణయం

భాజపాపై పోరాటాన్ని తమ పార్టీ అధ్యక్షుడే ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు సచిన్​ పైలట్​. అయితే గెలిచాక ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.

"జాతీయ స్థాయిలో భాజపాను ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్​. భాజపా మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు కీలకమే. అందుకే కాంగ్రెస్​దే నాయకత్వపాత్రగా ఉంటుందని అనుకుంటున్నా"- సచిన్​ పైలట్​, రాజస్థాన్​ ఉప ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: మరోసారి ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్​

ABOUT THE AUTHOR

...view details