కరోనా మహమ్మారి కారణంగా మార్చి25న మూసివేసిన శబరిమల దేవాలయం శుక్రవారం తెరుచుకుంది. ఇవాళ ఉదయం నుంచి భక్తులకు ఆలయ దర్శనం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. భక్తులు మాస్కులు ధరించి, కొవిడ్ నెగెటివ్ రిపోర్టు పత్రంతో దర్శనానికి రావాలని బోర్డు సూచించింది. ఈ నేపథ్యంలో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. మండల పూజ కోసం.. అక్టోబరు 21వరకు ఆలయం తెరుచుకొనే ఉండనుంది. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు లేని వారికి నీలక్కల్లో రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
వర్చువల్ విధానంలో దర్శనం :