రష్యా ఆమోదం తెలిపిన 'స్పుత్నిక్- వీ' కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా సంస్థలు నివేదించాయి.
ఈ వ్యాక్సిన్‌పై అంతర్జాతీయంగా సందేహాలు వస్తోన్నా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది రష్యా ప్రభుత్వం. ప్రకటన సమయంలో తన కూతురిపైనా వ్యాక్సిన్ ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సామర్థ్యానికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని తెలిపారు.