గ్రామీణాభివృద్ధే కేంద్రప్రభుత్వ ప్రథమ బాధ్యత అని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈనామ్ మార్కెట్ల ద్వారా అన్నదాతల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
గ్రామీణాభివృద్ధే కేంద్రం ప్రథమ బాధ్యత: రాష్ట్రపతి - undefined
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఉభయసభలను ఉద్దేశించిన ప్రసంగంలో తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. గ్రామీణాభివృద్దే కేంద్ర ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు.
" ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి ద్వారా 8కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.45 వేల కోట్లకుపైగా డబ్బు జమ అయింది. ఈ నెలలో 6 కోట్ల రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.12వేల కోట్ల నగదు బదిలీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను కాపాడేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఏటా ఐదున్నర కోట్లకు పైగా రైతులు తక్కువ ప్రీమియంతో తమ పంటలకు బీమా చేయించుకుంటున్నారు"
-రామ్‌నాథ్ కోవింద్,రాష్ట్రపతి .
TAGGED:
president latest news