అయోధ్య కేసులో రోజువారీ విచారణ చేపడతామన్న సుప్రీం తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది. ఈ నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు త్వరలోనే తొలగుతాయని అభిప్రాయపడింది.
'అయోధ్య కేసులో సుప్రీం రోజువారీ విచారణే సరి' - మధ్వవర్తి
అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తాజా తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది. రోజువారీ విచారణ చేపడితే రామమందిర నిర్మాణానికి త్వరలోనే అడ్డంకులు తొలిగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయోధ్య తీర్పు
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వ కమిటీ జులై 31న సమర్పించిన నివేదికపై నేడు సుప్రీం విచారణ చేపట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ