తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ తీర్పును స్వాగతించిన ఆర్ఎస్​ఎస్​

బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతించింది రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్ ​(ఆర్​ఎస్​ఎస్​). ఈ తీర్పు అనంతరం స్పందించిన ఆర్​ఎస్​ఎస్​.. దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చింది.

RSS welcomes Babri case verdict, calls for harmony
బాబ్రీ తీర్పును స్వాగతించిన ఆర్ఎస్​ఎస్​

By

Published : Sep 30, 2020, 3:54 PM IST

Updated : Sep 30, 2020, 4:50 PM IST

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్ ​(ఆర్​ఎస్​ఎస్​) స్వాగతించింది. ఈ నేపథ్యంలో దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి.. ప్రజలు సామరస్యంగా పని చేయాలని పిలుపునిస్తూ ట్వీట్​ చేశారు ఆర్​ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి.

"బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం. దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐకమత్యంతో సామరస్యంగా పని చేయాలి. తద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలి."

- సురేశ్​ భయ్యాజీ జోషి

బాబ్రీ మసీదు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా అగ్ర నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు.

ఇదీ చూడండి:బాబ్రీ తీర్పుపై అడ్వాణీ, జోషి హర్షం

Last Updated : Sep 30, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details