తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"హిందూ సంప్రదాయాలను రక్షించాలి" - అయోధ్య

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్​ఎస్​ఎస్ మరోసారి వ్యతిరేకించింది. హిందూ సంప్రదాయాలను కాపాడాలని గ్వాలియర్​​లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో తీర్మానం చేసింది .

"హిందూ సంప్రదాయాలను రక్షించాలి: ఆర్​ఎస్​ఎస్​"

By

Published : Mar 11, 2019, 9:31 AM IST

Updated : Mar 11, 2019, 9:51 AM IST

హిందూ సంప్రదాయాలను రక్షించాలి: ఆర్​ఎస్​ఎస్​
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్​ఎస్​ఎస్​ (రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​)​ మరోసారి వ్యతిరేకించింది. ఈ తీర్పు హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని ఉద్ఘాటించింది.

గ్వాలియర్​లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్​)లో హిందూ సంప్రదాయాలను, నమ్మకాలను రక్షించాలని తీర్మానం చేసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం ఆదివారంతో ముగిసింది. దాదాపు 1400 మంది ఈ సభకు హాజరయ్యారు.

"శబరిమల ఆంశం దేవునికి భక్తులకు సంబంధించింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న సంప్రదాయాలను పక్కనపెట్టి సుప్రీం కోర్టు తీర్పునివ్వడం దురదృష్టకరం. పునర్విచారణలోనైనా ఈ విషయాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం."
--- ఆర్​ఎస్​ఎస్​ తీర్మానం

ఈ విషయంలో కేరళ ప్రభుత్వ విధానాలను ఆర్​ఎస్​ఎస్​ తప్పుపట్టింది. ఎందరో మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించింది.

రామమందిర నిర్మాణంపై...

ఏబీపీఎస్​లో రామమందిర నిర్మాణంపైనా చర్చలు జరిగాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్​ఎస్​ఎస్​ ఉద్ఘాటించింది. సున్నిత అంశమైన రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ ప్యానెల్​ ఏర్పాటు చేసిన సుప్రీం నిర్ణయాన్ని ఆర్​ఎస్​ఎస్​ స్వాగతించింది.

Last Updated : Mar 11, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details