తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైశంకర్​.. ఆ నలుగురిలో అత్యున్నత విద్యావంతుడు - ఎన్నికలు

జులై 5న గుజరాత్​లోని రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం నలుగురు అభ్యర్థులు నామినేషన్​లను​ సమర్పించారు. వీరిలో అత్యంత విద్యావంతుడు జైశంకర్​. అత్యంత ధనికుడు భాజపా నేత జగల్జి ఠాకోర్​.

జైశంకర్​... ఆ నలుగురిలో అత్యంత అర్హుడు

By

Published : Jun 26, 2019, 7:11 AM IST

గుజరాత్​లోనిరెండు ​ స్థానాల ఎన్నికల కోసం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. భాజపా తరఫున విదేశాంగమంత్రి జైశంకర్​, జుగల్జి ఠాకూర్​... కాంగ్రెస్​ నుంచి చంద్రిక చూదసమ, గౌరవ్​ పాండ్య మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు.

జైశంకర్​ టాప్​...

విద్యాపరంగా వీరిలో జైశంకర్​ అత్యంత అర్హుడు. ఠకూర్​ అత్యంత ధనికుడు. నామపత్రంలో ఠాకూర్​ తన సంపద రూ.101కోట్లుగా పేర్కొన్నారు.

ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్​డీ​ పట్టా పొందినట్టు జైశంకర్​ తన అఫిడవిట్​లో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సంపద రూ.15.82 కోట్లు.

ధనికుల జాబితాలో ఈ నలుగురిలో రూ.2.56 కోట్లతో కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రిక చూదసమ చివరి స్థానంలో ఉన్నారు. తనపై పోలీసు ఆదేశాల ధిక్కరణ కేసు ఉందని గౌరవ్​ పాండ్య నామినేషన్​ పత్రాల్లో పేర్కొన్నారు.

గుజరాత్​లోని రెండు రాజ్యసభ స్థానాలకు జులై 5న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:- భారత్​కు చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ

ABOUT THE AUTHOR

...view details