2019 జూన్ 1 నాటికి రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 2.94లక్షల ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నట్టు తెలిపింది.
లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ గణాంకాలను వెల్లడించారు. గత దశాబ్దం కాలంలో 4 లక్షల 61 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు.
ఈ ఏడాది 1.42 లక్షల ఉద్యోగాలు...
1991 వరకు రైల్వేలో 16,54,985 మంది ఉద్యోగులు ఉన్నారని... 2019లో ఆ సంఖ్య 12,48,101కు చేరుకుందని రైల్వే మంత్రి తెలిపారు. 2లక్షల 94వేల 420 ఖాళీల భర్తీ కోసం నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు లక్షా 51 వేల 843 పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. 2019-20 కాలంలో మరో లక్షా 42 వేల 577 ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తామని పీయుష్ గోయల్ వివరించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
ఇదీ చూడండి:- వైరల్: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా