రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఈనెల 14న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షం ఎన్డీఏ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ తమ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ పేరును ఇప్పటికే ఖరారు చేసింది. అధికార కూటమిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించాయి. అది కూడా బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పేరును ఖరారు చేసినట్లు సమాచారం. శుక్రవారం మనోజ్ ఝా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మనోజ్ ఝా మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు మంచి వక్తగా పేరుంది.
రాజ్యసభ ఛైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు నేతలు బిహార్‌కు చెందిన వారే కావడం గమనార్హం. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి ముందు జరిగే ఈ పోరు రాజ్యసభ వేదికగా జేడీయూ వర్సెస్ ఆర్జేడీ మధ్య పోటీగా మారే అవకాశం ఉంది.