కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రింట్ మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రింట్ మీడియా అధినేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
దేశంలోని ప్రింట్ మీడియా అధినేతలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారితో చర్చలు జరిపారు. ప్రాణాంతక వైరస్‌పై పోరులో మీడియా పాత్రను కొనియాడారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది వరుసగా రెండో రోజు.
వైరస్ నియంత్రణకు సమాచార మాధ్యమాలు చేస్తున్న కృషిని అభినందించారు మోదీ. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకొని.. వైరస్‌పై అవగాహన పెంచడంలో మీడియా చేసిన కృషిని మోదీ కొనియాడారు. సుదీర్ఘమైన ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తాజా సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. మీడియా అందించే సమాచారం ప్రభుత్వానికి సైతం కీలకమైన ఫీడ్బ్యాక్లా ఉంటుందన్నారు. శాస్త్రీయమైన రిపోర్టులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మీడియా అధినేతలతో మోదీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం వరుసగా ఇది రెండోరోజు.