చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయినప్పటికీ.. అన్వేషణ కొనసాగుతుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌లో ఏడేళ్లకు సరిపడా ఇంధనం నింపినందున అప్పటివరకు అది పనిచేస్తుందని అంచనా వేశారు. మరో 14 రోజుల్లో విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. చంద్రయాన్-2 ప్రయోగం 100 శాతం విజయానికి అతి దగ్గరలోనే ఉందన్నారు ఇస్రో అధిపతి.
'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ : శివన్
విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ప్రకటించారు. విక్రమ్‌తో తిరిగి అనుసంధానం చేసేందుకు 14 రోజులు ప్రయత్నిస్తామని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం 100 శాతం విజయానికి అతి దగ్గరలోనే ఉందన్నారు ఇస్రో అధిపతి.
శివన్
ఆర్బిటర్ ఏడాది పాటు పనిచేస్తుందని గతంలో ఇస్రో భావించినప్పటికీ.. కచ్చితమైన మిషన్ నిర్వహణ కారణంగా అంతకు ఏడురెట్లు అంటే ఏడేళ్ల పాటు ఆర్బిటర్ పనిచేసే అవకాశముందని తాజాగా వెల్లడించారు. చంద్రుడి పరిణామ క్రమంతోపాటు, జాబిల్లిపై లవణాలు, ధృవప్రాంతాల్లోని నీటికణాలపై పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఆర్బిటర్‌లో వాడిన అత్యధిక రిజల్యూషన్ కెమెరా తీసే ఫోటోలు.. ప్రపంచ వైజ్ఞానిక రంగానికి చాలా ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
Last Updated : Sep 29, 2019, 7:57 PM IST