తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'72 గంటల వంట'తో ప్రపంచ రికార్డుకు యత్నం

వంట చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు మధ్యప్రదేశ్​ రివా జిల్లాకు చెందిన లతా టాండన్ సిద్ధమయ్యారు. 72 గంటలపాటు నిర్విరామంగా వండి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు.

72 గంటల వంట

By

Published : Sep 4, 2019, 3:07 PM IST

Updated : Sep 29, 2019, 10:14 AM IST

'72 గంటల వంట'తో ప్రపంచ రికార్డుకు శ్రీకారం

మధ్యప్రదేశ్​ రివా జిల్లాకు చెందిన లతా టాండన్​కు వంట చేయటం అంటే అమితాసక్తి. ఎంతలా అంటే కొన్ని గంటలపాటు నిర్విరామంగా వండగలరు. అదే ఆసక్తితో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

గిన్నిస్​ వరల్డ్​ రికార్డు పరిశీలకుల సమక్షంలో హోటల్​ స్టార్​​లో మంగళవారం ఉదయం 9 గంటలకు హల్వా, కిచిడీ తయారీతో లతా వంట ప్రారంభించారు. సెప్టెంబర్​ 6వ తేదీ వరకు మొత్తం 72 గంటలపాటు వివిధ రకాల వంటలు చేయనున్నారు. ప్రతి గంటకు ఒక 5 నిమిషాల పాటు విరామం ఉంటుంది.

"సుదీర్ఘ సమయం. ఇంతకుముందు రికార్డు అమెరికాలో నమోదైంది. 68 గంటల 3 నిమిషాల పాటు వంట చేశారు. భారత్​ తరఫున లత 72 గంటలకు పైగా చేయాలని సంకల్పించారు."

-మోహిత్​ టాండన్​, నిర్వాహకుడు

ఈ రికార్డు వంట కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు స్థానికులు తరలివస్తున్నారు.

ఇదీ చూడండి: మూడు రోజుల పూజలు.. ఏడాదంతా గదిలోనే 'ఓనవిల్లు'!

Last Updated : Sep 29, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details