తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షికంగా అమలు - శాంతిభద్రతలు

జమ్ముకశ్మీర్​లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టంచేశారు ఆ రాష్ట్ర అదనపు డీజీపీ మునీర్​ ఖాన్. జమ్ములో ఆంక్షలు ఎత్తివేశామని, కశ్మీర్​ విషయంలో పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షిక అమలు

By

Published : Aug 14, 2019, 3:26 PM IST

Updated : Sep 27, 2019, 12:04 AM IST

ఆర్టికల్ 370 రద్దుతో ఉద్రిక్తతలు తలెత్తవచ్చన్న అనుమానాల నేపథ్యంలో విధించిన ఆంక్షలను జమ్ములో తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర అదనపు డీజీపీ మునీర్​ ఖాన్. కశ్మీర్​లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

శ్రీనగర్​ సహా పలు జిల్లాలు, కశ్మీర్​ లోయలో చెదురుమదురు ఘటనలు జరిగినా సమర్థంగా నిలువరించామని వెల్లడించారు మునీర్. కశ్మీర్ ​లోయలో కొంతమందికి పెల్లెట్​ గాయాలైనట్లు ధ్రువీకరించారు అదనపు డీజీపీ. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడమే తాము సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు.

జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షిక అమలు

"జమ్ములో ఆంక్షలు ఎత్తేశాం. పాఠశాలలు సహా వివిధ సంస్థలు సాధారణంగా నడుస్తున్నాయి. కశ్మీర్​లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను పూర్తిస్థాయిలో అంచనా వేశాకే నిషేధాజ్ఞలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకమొత్తంగా ఆదేశాలు జారీ చేయలేదు. ఆంక్షల తొలగింపునకూ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేశాకే నిర్ణయం ఉంటుంది. ఈ పరిశీలన చేయాల్సింది జిల్లా అధికారులే. ప్రస్తుతం మా ముఖ్య లక్ష్యం ఆగస్టు 15. శాంతి పూర్వకంగా వేడుకలు నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం."

Last Updated : Sep 27, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details