తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాలెట్​ పేపర్లు తిరిగి తీసుకురావాలి: మమత

ఎలక్ట్రానిక్ ఓటింగ్​ యంత్రాల (ఈవీఎంలు) వినియోగంపై మరోమారు ఆరోపణలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్​ పేపర్లను వినియోగించాలని డిమాండ్ చేశారు.

మమతా బెనర్జీ

By

Published : Jul 21, 2019, 1:11 PM IST

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషన్ (ఈవీఎం)ల స్థానంలో బ్యాలెట్​ పేపర్లను తిరిగి తీసుకురావాలని డిమాండ్​ చేశారు తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు విధానాల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.

"ఇంగ్లాండ్​, ఫ్రాన్స్​, జర్మనీ, అమెరికా వంటి దేశాలు గతంలో ఈవీఎంలను వినియోగించాయని మరచిపోకూడదు. కానీ ఆ దేశాలు ప్రస్తుతం ఈవీఎంలను వాడటం లేదు. మనమెందుకు బ్యాలెట్​ పేపర్లను తిరిగి తీసుకురాకూడదు? ఎన్నికల విధానాల్లో సంస్కరణలు అవసరమని 1995 నుంచి నేను డిమాండ్​ చేస్తున్నా. రాజకీయ పార్టీలు పారదర్శకంగా ఉండేందుకు తప్పనిసరిగా ఎన్నికల సంస్కరణలు అవసరం."

- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నల్లధనాన్ని వినియోగిస్తున్నాయని ఆరోపించారు మమత. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా సర్కారు నిధుల వినియోగం అవసరమన్నారు.

ఇదీ చూడండి: దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం

ABOUT THE AUTHOR

...view details