కరోనా పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి సెమిస్టర్ పరీక్షలు వచ్చే జులైలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). పరీక్షల నిర్వహణ వ్యవధిని 3గంటల నుంచి 2 గంటలకు కుదించాలని ఆదేశించింది.
కరోనా విజృంభన, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు, అకాడమిక్ క్యాలెండర్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది యూజీసీ. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలను జులైలోనే నిర్వహించాలని తెలిపింది. మధ్యంతర సెమిస్టర్ విద్యార్థులకు మాత్రం అంతర్గత మదింపు ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని సూచించింది. పరిస్థితులు కుదుటపడ్డ రాష్ట్రాల్లో జులైలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. అందుబాటులో ఉన్న వ్యవస్థలను బట్టి పరీక్షలు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఏది ఉత్తమమైనదో విశ్వవిద్యాలయాలే నిర్ణయించుకోవాలని యూజీసీ సూచించింది. ఆఫ్ లైన్ అయితే.. వ్యక్తిగత దూరం నిబంధనలు పాటించాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణే ప్రథమ ప్రాధాన్యం కావాలని స్పష్టం చేసింది.
అంతర్గత మదింపు ద్వారా..