తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 9:57 PM IST

Updated : Jun 28, 2020, 10:24 PM IST

ETV Bharat / bharat

'కరోనా బాధితుల కంటే నయమైన వారి సంఖ్య లక్ష ఎక్కువ'

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో ఉన్నవారి కంటే వైరస్ నయమైనవారి సంఖ్య లక్షకు పైగా ఉందని వెల్లడించింది. వైరస్​ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సమర్థమైన చర్యల వల్లే ఇది సాధ్యమైనట్టు స్పష్టం చేసింది.

Recovered COVID-19 patients exceed active cases by over 1 lakh: Health Ministry
యాక్టివ్​ కేసుల కంటే లక్షమందికి పైగా రికవరీ రేటు!

దేశంలో కరోనా మహ్మమారి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫలితంగా కొవిడ్-19​ నుంచి కోలుకుంటున్నవారి శాతం గణనీయంగా పెరిగింది. శనివారం నాటికి కరోనా రోగుల సంఖ్య కంటే వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,06,661 ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 3,09,712 మందికి నయమైంది.

"రికవరీ రేటు 58.56 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 2,03,051 మంది వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కరోనా నివారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా కేంద్రం తీసుకున్న సమర్థమైన చర్యల వల్లే ఇది సాధ్యమైంది."

-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఇవే!

  • దేశవ్యాప్తంగా ప్రభుత్వ(749), ప్రైవేటు(287) రంగంలో మొత్తం 1,036 కొవిడ్​-19 పరీక్ష ల్యాబ్​లు ఏర్పాటు.
  • రోజూ 2లక్షలకు పైగా నమూనా పరీక్షలు. ఇప్పటివరకు 82,27,802 మందికి వైరస్​ నిర్ధరణ పరీక్షల నిర్వహణ.
  • కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 1,77,529 ఐసోలేషన్​ బెడ్స్, 23,168 ఐసీయూ, 78,060 ఆక్సిజన్​ సపోర్టెడ్​ బెడ్స్​​తో 1,055 ఆస్పత్రుల కేటాయింపు.
  • 1,40,099 ఐసోలేషన్​ బెడ్స్​, 11,508 ఐసీయూ, 51,371 ఆక్సిజన్​ సపోర్టెడ్​ బెడ్స్​తో 2,400 కొవిడ్-19​ ఆరోగ్య కేంద్రాలు.
  • వైరస్​ను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా 8,34,128 బెడ్స్​తో 9,519 కరోనా సంరక్షణ కేంద్రాల ఏర్పాటు.
  • రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 187.43 లక్షల ఎన్​95 మాస్క్​లు పంపిణీ, 116.99 లక్షల వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు(పీపీఈ కిట్లు) అందజేత.

ఇదీ చూడండి:సీబీఐ చేతికి తండ్రి, కొడుకుల లాకప్​డెత్ కేసు

Last Updated : Jun 28, 2020, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details