తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​డీఏకే బి'హారం'.. విజయానికి కారణాలు ఇవే..

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు మరోసారి తలకిందులయ్యాయి. బిహార్​లో ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమిదే విజయమని భావించిన వారందరికీ షాక్​ తగిలింది. ఊహించని విధంగా ఎన్​డీఏ విజయపథంలో దూసుకుపోయింది. ముఖ్యంగా భాజపా అందరి అంచనాలకు మించి ఎన్డీఏలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది?

BIHAR ASSEMBLY
ఎన్​డీఏకే 'బిహారం'.. విజయానికి కారణాలేంటి?

By

Published : Nov 10, 2020, 9:09 PM IST

బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్​డీఏ విజయఢంకా మోగించింది. ఎన్​డీఏలోని భాజపా గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుపొందింది. బిహార్​లో మొట్టమొదటి సారి రెండో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ఎన్​డీఏ భాగస్వామ్య పార్టీ జేడీయూకి మాత్రం కొన్ని చోట్ల ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఎగ్జిట్​ పోల్స్​ మరోసారి ప్రజానాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. అసలు ఎన్​డీఏ విజయానికి కారణాలేంటి?

సుపరిపాలన, అభివృద్ధి...

బిహార్‌లో నితీశ్​ మార్క్ సుపరిపాలన, అభివృద్ధి పథకాల కొనసాగింపే లక్ష్యంగా ఎన్​డీఏ ఎన్నికల బరిలో నిలిచింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ఎన్నికల ప్రణాళికలో వివరించారు.

మహిళా సాధికారత కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని నితీశ్​ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 200 రోజులకు పెంచుతామని వాగ్దానం చేశారు. ఇవన్నీ ఎన్​డీఏ విజయానికి కారణమయ్యాయి.

మోదీయే బలం...

ఈ ఎన్నికల్లో నితీశ్​ కుమార్​ నేతృత్వంలోనే బరిలోకి దిగింది ఎన్​డీఏ. కానీ ఫలితాలు చూస్తే నితీశ్​ పాలన కన్నా మోదీ చరిష్మాయే బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. జేడీయూ కన్నా భాజపా అధిక స్థానాల్లో గెలుపొందడమే ఇందుకు నిదర్శనం.

మోదీ సహా అగ్రనేతల ప్రచారం...

ఎన్​డీఏ తరఫున మోదీ రెండు భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ముఖ్యంగా ఆర్​జేడీపై మోదీ చేసిన అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మోదీతో పాటు ఎన్​డీఏ అగ్రనాయకులు ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రచారాన్ని మొదలుపెట్టడం కలిసివచ్చింది.

ప్రత్యర్థి ఓటు బ్యాంక్​పై...

బిహార్​ రాజకీయాల్లో దళితులు(డీ), ముస్లింలు(ఎం), యాదవులు(వై) ఎంతో కీలకం. రాష్ట్రంలో దాదాపు 50 శాతం ఓట్లు వారివే. ఏ కూటమి అధికారం చేపడుతుందో నిర్ణయించడంలో ఈ మూడు వర్గాలే కీలకం. ఈ వర్గాలపై గురిపెట్టడం ఎన్​డీఏకు కలిసివచ్చింది.

ముఖ్యంగా ప్రత్యర్థి ఓటు బ్యాంక్​లైన ముస్లిం, యాదవులపై ప్రత్యేక దృష్టి పెట్టారు నితీశ్. ఎన్నికలకు ముందు జేడీయూలోకి చేరిన ఆర్​జేడీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు యాదవులే. వీరి ఓట్లు రాబట్టుకోవడంలో నితీశ్​ కీలకంగా వ్యవహరించారు.

ఉచిత వ్యాక్సిన్ ప్రకటన...

ఈ ఎన్నికల్లో ఎన్​డీఏ ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్​ హామీ విపక్షాల విమర్శలకు కారణమైంది. అయితే ప్రజలు దీనిపై సానుకూలతనే చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కాలంలో ఈ వాగ్దానం ఎన్​డీఏకు కలిసివచ్చినట్టే కనిపిస్తోంది.

లిక్కర్​ అస్త్రం...

బిహార్​లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం మహిళా ఓటర్లను ఆకర్షించింది. మహిళా ఓటు బ్యాంకుపై నితీశ్​ గురిపెట్టిన అస్త్రం మంచి ఫలితాలనే ఇచ్చింది.

యువత.....

మహాకూటమి ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల కల్పనపై తొలుత ఎన్​డీఏ కంగారు పడినట్లు కనిపించినా వెంటనే తేరుకొని 19 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది. యువ ఓటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ఈ మంత్రం ఫలించింది.

ఐటీ హబ్​...

ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి ఐటీ హబ్​, ఐటీ ఇన్​ఫ్రా అభివృద్ధి ప్రకటనలు కలిసివచ్చాయి.

మధ్యతరగతి...

గ్రామాలు, పట్టణాల్లో 30 లక్షల మందికి గృహకల్పన వాగ్దానం మధ్యతరగతి ఓట్లను రాబట్టింది.

లక్ష మంది మహిళలకు మైక్రో ఫైనాన్సింగ్​ సదుపాయం ఇస్తామనడం కలిసివచ్చింది.

ABOUT THE AUTHOR

...view details