తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ ఉపసంహరించుకుంటే మోదీతో చర్చకు సిద్ధం' - mamata benerjee

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడినంత మాత్రాన విపక్షాలు జాతివ్యతిరేకులు కారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. వివాదస్పద సీఏఏను వెనక్కి తీసుకుంటే ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

mamata
సీఏఏను వెనక్కు తీసుకుంటే మోదీతో చర్చకు సిద్ధం

By

Published : Jan 28, 2020, 6:48 PM IST

Updated : Feb 28, 2020, 7:38 AM IST

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడినంత మాత్రాన విపక్షాలు జాతివ్యతిరేకులు కారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వివాదాస్పద పౌర చట్టాన్ని వెనక్కి తీసుకుంటే సీఏఏపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

సీఏఏకు వ్యతిరేకంగా పెయింటింగ్స్‌తో నిరసన తెలుపుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత.. బంగాల్‌లో సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను అమలు చేసేది లేదని పునరుద్ఘాటించారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్‌ల తర్వాత... సీఏఏ అమలును నిరాకరిస్తూ ఓ తీర్మానాన్ని బంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్​ఆర్​సీ వ్యతిరేక తీర్మానానికి సైతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి : నిర్భయ దోషి పిటిషన్​పై రేపు సుప్రీం తీర్పు

Last Updated : Feb 28, 2020, 7:38 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details