తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల వరకు కార్యాలయాలకు చేరుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

By

Published : Jun 28, 2019, 11:15 PM IST

'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల లోపు కార్యాలయాలకు చేరుకోవాలని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. ఈ నిబంధన మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

"ప్రభుత్వ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్​లు, ఎస్పీలు ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ నిబంధనలు అధికారులు కచ్చితంగా పాటించాలన్నారు. తక్షణం అమలులోకి వచ్చిన ఈ నిబంధనలు మీరిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు."

- ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి కార్యాలయం​

కేంద్ర మంత్రులు ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం మానుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రధాని ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని యోగి ఆదిత్యనాథ్​ తాజా ఆదేశాలు జారీ చేశారు.

రోజుకు 20 గంటలు పనిచేయాల్సిందే...

2017లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన యోగి ఆదిత్యనాథ్​.... రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయడానికి సిద్ధపడని అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు మీరితే సహించబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు

ABOUT THE AUTHOR

...view details